తెలంగాణతో చర్చలు జరపడానికి ప్రముఖ దుస్తుల బ్రాండ్ కిటెక్స్ వస్తోంది. తెలంగాణలో మెగా టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేస్తోంది. చర్చలు జరిపేందుకు కిటెక్స్ గ్రూప్ చైర్మన్ సాబు ఎం జాకబ్‌తో సహా మొత్తం 6 మంది సభ్యుల ప్రతినిధి బృందం తెలంగాణకు రానున్నారు. వాళ్ళు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ సంస్థ ముందుగా కేరళలో 3500 కోట్లతో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటుంది.

అయితే ఆ పెట్టుబడులు తెలంగాణ లో పెట్టేందుకు పరిశ్రమల మంత్రి కేటీఆర్ తో చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది. కిటెక్స్ ప్రతినిధి బృందానికి విందు ఆతిధ్యం ఇవ్వడానికి పరిశ్రమల మంత్రి  కె.టి.రామారావు తెలంగాణలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. ఒక వేళ చర్చలు ఫలించి ఒప్పందం కుదిరితే హైదరబాద్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కాబోతోంది. అంతే కాకుండా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉందిి.

మరింత సమాచారం తెలుసుకోండి: