పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేసారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల అవుతుంది అని అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట జనవరి 13న విడుదల కానుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ లెక్కన చూసుకుంటే టాలీవుడ్ లో ముగ్గురు స్టార్ హీరోలు ఒకేసారి పోటీ పడుతున్నారు. దాంతో ముగ్గురు హీరోల అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ హీరోల అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రపంచం కూడా ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తోంది. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సంక్రాంతి హిట్ గా నిలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: