
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల నిర్వహణ సవ్యంగా లేదని వార్తలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ ఈ విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్న సంగతి కూడా దాదాపు అందరికీ విదితమే.. రోడ్లు ఎక్కడికక్కడ గోతులు పడి గుంతలు పడి ఉండటంతో వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు అని ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అలాగే సోషల్ మీడియా దృష్టికి తీసుకు వస్తూనే ఉంది. ప్రభుత్వం ఎందుకో గాని ఈ విషయం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నించింది. బిల్లులు ఇస్తారన్న నమ్మకం లేక వైసిపి ప్రభుత్వ పాలనలో రోడ్లు బాగు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు, వారి వీధి దీపాలు నిర్వహించడానికి ఏమైంది ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్దంలాంటి రోడ్లమీద పాదయాత్ర చేయడం కాదు జగన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలి అంటూ టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కానీ ఇప్పుడు పాదయాత్ర చేస్తే నిజంగా ఎలా ఉంటుంది ? జగన్ కు ఎలాంటి స్పందన వస్తుందో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం.