ఏపీ సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కు సంబంధించి నేడు సిబిఐ కోర్ట్ తీర్పు ఇస్తున్న నేపధ్యంలో ఏం జరగబోతుంది ఏంటీ అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరిగిపోతుంది. అటు ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయంలో కంగారు పడుతున్నాయి. అయితే వైసీపీ అనుకూల మీడియా పేరుతో ఉన్న కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పోస్ట్ చేస్తున్న అంశాలు వివాదాస్పదంగా మారాయి.

తీర్పు రాకుండానే సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసారు అని చెప్తూ తీర్పు వచ్చినట్టు పోస్ట్ చేసేసింది. బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటీషన్ వేసారని... దీనికి స్పందించిన కోర్ట్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిందని సాక్ష్యులను ప్రభావితం చేసారన్న రఘురామ కృష్ణం రాజు వాదనలను సిబిఐ కోర్ట్ తోసి పుచ్చింది అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: