ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ లో బుధవారం మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతులకు సంబంధించి నేడు ఏపీ హైకోర్ట్ లో విచారణ జరగగా... ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 316 కి సంబంధించి తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాజధానిలో అసైన్డ్ రైతులకు జారీ చేసిన రిటర్నబుల్ ఫ్లాట్లను వెనక్కు తీసుకుంటూ పైన పేర్కొన్న జీవో జారీ చేసారు.

ఆ జీవో కి సంబంధించి హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నేడు మరో రెండు షాక్ లు తగిలాయి. సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలుగా దాడి దేవిని కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సంచలనం అయింది. అలాగే సంఘం డైరీ కేసులో ప్రభుత్వనికి చుక్కెదురు అయింది. సింగిల్ బెంచ్ తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ల బెంచ్ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్ కు షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: