మధ్య ప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతుర్ని ప్రేమించి ఆమెను తీసుకెళ్లాడు అనే కోపం తో యువతి తండ్రి యువకుడిపై ఇనపరాడ్డు తో దాడి చేశాడు. పుష్పక భావ్సర్ అనే యువకుడు తాను నివాసం ఉండే ప్రాంతం లోనే ఓ యువతి తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకోవడం తో ఇద్దరూ కలిసి ఇంటి నుండి పారిపోయారు.

దాంతో అనేక గొడవలు జరిగి తిరిగి ఇంటికి రావాలంటూ తల్లి తండ్రులు ఫోన్ చేశారు. దాంతో యువతి, యువకులు ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. అయితే తన కూతురు ను ప్రేమించి ఎత్తుకెళ్లాడు అనే కోపం తో యువతి తండ్రి యువకుడిపై ఇనపరాడ్డు తో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా రోడ్డుపైనే యువకుడిపై దాడి చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఘటన పై యువకుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: