టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి20 కెప్టెన్సీకి రాజీనామా చేస్తూ కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాసేపటి క్రితం దీని పై రాసిన లేఖను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడెనిమిది ఏళ్ల నుంచి తనపై వర్క్ లోడ్ పెరిగిపోయిందని కాబట్టి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి రాజీనామా చేస్తున్నానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను చాలా ఒత్తిడికి గురయ్యా అని అందుకు చాలా సమయం పట్టిందని కోహ్లీ పేర్కొన్నాడు.ఓపెనర్ రోహిత్ శర్మ అలాగే రవి శాస్త్రి అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీ జై షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో తాను చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా కోహ్లీ తెలిపాడు. అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత తాను కెప్టెన్గా తప్పుకుంటానని కోహ్లీ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: