ఏపీ జ‌ల‌న‌వ‌రుల‌శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ పెద్ద మ‌న‌సు చేసుకొని తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను ప‌రిష్క‌రించాల‌ని క‌థానాయ‌కుడు సంపూర్ణేష్‌బాబు కోరారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌క్ష‌ణం స్పందించే సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడు క‌ష్టాల్లో ఉంద‌ని, ఎగ్జిబిట‌ర్లు ఇంకా క‌ష్టాల్లో ఉన్నార‌న్నారు. మంచి మ‌న‌సున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో త‌న‌ని పోల్చ‌డంపై ఆయ‌న ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డంతోపాటు అనిల్‌కుమార్ యాద‌వ్‌కు కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలియ‌జేశారు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజ‌రైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. త‌న ఒక్క‌డి కోసం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తాన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని, టికెట్ల వ్యాపారంతో కొత్త అప్పులు తెచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోందంటూ మండిప‌డ్డారు. దీనికి ప్ర‌తిగా ఈరోజు మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయినా, సంపూర్ణేష్‌బాబు అయినా త‌మ‌కు ఒక్క‌టేన‌ని, ఆన్‌లైన్ టికెట్ల విధానాన్ని తీసుకురావాల‌నేది ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మ‌ని, దీనివ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు లాభ‌మ‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సంపు స్పందించారు. ప‌వ‌న్‌తో త‌న‌ను పోల్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: