తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని అధికార పార్టీ చాలా పట్టుదలగా వ్యవహరిస్తుంది. మంత్రులు కొందరు ఇప్పుడు జిల్లాల మీద సిఎం కేసీఆర్ ఆదేశాలతో గట్టిగా ఫోకస్ చేసారు. నియోజకవర్గల వారిగా సమీక్ష సమావేశం లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నియోజకవర్గ ల్లో నాయకుల మధ్య గ్యాప్,కింది స్థాయి నాయకత్వం ఎదుర్కొంటున్న సమస్యల పై అరా తీస్తున్నారు  కేటీఆర్.

మనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది మనం మళ్ళీ గెలుస్తాము అని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పటికే అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నాం.. ఇంకా చెయ్యాల్సి ఉంది చేద్దాం అని అన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అందరూ పార్టీ కోసం హార్డ్ వర్క్ చెయ్యాలి అని కోరారు. వరంగల్ సభకు ప్రతి గ్రామం నుండి తరలి రావాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: