తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఈనెల 30న నిర్వ‌హించే ఉపఎన్నిక  స‌మయం స‌మీపిస్తుండ‌డంతో ప్ర‌చారాన్ని జోరుగా కొన‌సాగిస్తున్నారు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు. శుక్ర‌వారం ప్ర‌చారంలో ఈట‌ల మాట్లాడారు.  రాష్ట్రంలో నిర్మాణం చేప‌డుతున్న రోడ్ల‌న్నింటికి నిధులను కేంద్రం రూ.90 పైస‌లు ఇస్తుంటే.. రాష్ట్రం కేవ‌లం 10 పైస‌లు మాత్ర‌మే ఇస్తున్న‌ద‌ని చెప్పారు. చిన్న‌పిల్ల‌ల కోసం రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆసుప్ర‌తిల‌లో ఇచ్చే కేసీఆర్ కిట్ ప‌థ‌కానికి కేంద్రం రూ.5వేలు ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. సొమ్మేమో కేంద్రానిది. సోకేమో కేసీఆర్‌ది అని ఎద్దేవా చేశారు.

రైతుల వ‌ద్ద నుంచి వ‌డ్లు కొనేది కేసీఆర్ కానే కాదు. ప్ర‌తీ గింజ కేంద్రం కొంటున్న‌ద‌ని తెలిపారు. మ‌హిళా గ్రూపుల‌కు ఇచ్చే క‌మీష‌న్లు, హ‌మాలీల‌కు ఇచ్చే క‌మీష‌న్లను సైతం కేంద్రం ఇస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ వ‌డ్ల‌ను కొన‌ను అంటున్నాడు. వ‌డ్లు కొన‌కుండా ఏవిధంగా ఉంటాడో చూద్దాం అన్నారు. ఐకేపీ సెంట‌ర్లు వ‌డ్లు కొంటాయ్‌. క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదిముబార‌క్‌, పెన్ష‌న్‌ల‌కు అయ్యే ఖ‌ర్చు కంటే రాష్ట్రానికి మ‌ద్యం మీద వ‌చ్చే ఆదాయం చాలా ఎక్కువ అని వెల్ల‌డించారు ఈట‌ల‌. మొత్తం అమ్మి అయినా స‌రే ఖ‌ర్చు పెట్టు.. కేసీఆర్ ను మాత్రం వ‌దిలిపెట్ట‌కు అని  నా భార్య నాకు చెప్పింది. మీరంద‌రూ ప‌ట్టుబ‌డితే టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడ ద‌క్క‌ద‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: