ఇటీవల విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి
వైసీపీ ప్రభుత్వంపై, ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం విధితమే.
విశాఖ ఉక్కుకు సంబంధించి
వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు పవన్. ఎంపీలు ఏమి చేస్తున్నారని, పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అదేవిధంగా ఎక్కడో కొరియాలో ఉన్న పోస్కో కంపెనీ ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు జరిపినది ఎవరని.. దీనికి
వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపడానికి వచ్చిన అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల
జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు పవన్.
పవన్ వ్యాఖ్యలకు
మంత్రి కొడాలి
నాని స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను ఉద్యమం చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. తాజాగా పవన్‌కు జ్ఞానోదయం కలిగి
విశాఖ ఉక్కు పరిరక్షణకు ముందుకు వచ్చినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు ప్రకటించారు నాని. రాష్ట్రంలో డెడ్
పార్టీ అయిన జనసేన మాకు డెడ్‌లైన్ ఏమి పెడుతుందని పేర్కొన్నారు. కేంద్రానికి వెళ్లి పవన్ మోడీకి డెడ్‌లైన్ పెడితే ఏమైనా భయపడతారేమోనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీలు టీడీపీ, జనసేనలు అని.. వాటి డెడ్‌లైన్‌లకు మేము భయపడమని వెల్లడించారు.