లైఫ్ లో ఆపాటి ఆహా ఉండాల్సిందేనని పొంగిపోయాడు అల్లు అర్జున్. అవును అలాంటి ఆహానే కోరుకున్నాడు జగన్. ఒక ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకోలేక దానికో పెద్ద హంగామాను, పెద్ద డ్రామాను నడిపి ఆఖరికి గెలిచింది ప్రజాస్వామ్యమేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏ ఎన్నికల్లో అయినా గెలిచేది ఓటు బ్యాంకు కాదు నోటు బ్యాంకు. అయితే ఇక్కడ ఓట్లు కోసం తాము నోట్లు పంచలేదని నిజాయితీగానే ఈ ఎన్నికల్లో పనిచేశామని
వైసీపీ చెప్పినా అదేమంత నమ్మశక్యంగా లేదు. పక్క ఊరి నుంచి జనాలను ఎలా తెచ్చారో ఎలా ఓట్లు వేయించారో ఎలా రిగ్గింగ్ చేశారో అన్నీ అన్నీ కెమెరాలకు చిక్కాయని అంటోంది టీడీపీ. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల పేరిట ఇంటికో నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలను ప్రత్యక్షంగానో, పరోక్ష్యంగానో అందించాలన్న సంకల్పంతో తన పదవి కాలాన్నీ తన ఆలోచననీ వినియోగించుకోవాలని చూస్తున్న జగన్ కొత్త డబ్బు పంచడం ఏంటి? ప్రతి నెలా చేస్తున్నదే అది కదా అని విమర్శిస్తోంది బీజేపీ. ఇవేవీ వినిపించుకోని జగన్ కొత్త పొత్తులపైనే కలవరంలో ఉన్నాడు అని సమాచారం. సో .. ఇప్పుడు జగన్ కు కలవర మాయె మదిలో పాట ఒకటి వినిపించుండ్రి!
బద్వేలు మ్యాచ్ తనకు అనుకూలంగా ఉందని పొంగిపోయాడు జగన్. పొంగిపోతున్నాడు జగన్. ఏదో ఒకటి రాయనివ్వండి నన్ను. ఆలోచించనివ్వడం నన్ను. తన పథకాలు తన ఆలోచనలు ఎప్పటికీ జనాలకు మంచి చేసేవే అని చెబుతున్నాడు మా జగన్ అన్న. కానీ వాస్తవం వేరులా ఉంది కాదు కాదు కాండంలా ఉంది కాదు కాదు చెట్టులా ఉంది కాదు కాదు చెట్టు నీడలా ఉంది. ఏదో ఒకలా ఉంది కానీ ఈ సారి మాత్రం జగన్ కు ఆశించిన సాయం ఏదీ ఓటరు నుంచి దక్కలేదు. పోలింగ్ శాతం కూడా పెద్దగా బాలేదు.
ఇవి అటుంచితే ఆయన ఎంత నిలువరిద్దాం అనుకున్నా బీజేపీకి
టీడీపీ దూరం కాదు దగ్గరవుతూనే ఉంది. ఆయన ఎంత కాదన్నా ఆయన ఎంత ఔనన్నా పవన్ కు బీజేపీపై ఉన్న ప్రేమను తగ్గించలేడు. ఇలా ఏం చేసినా చేయకున్నా జగన్ అనే సీఎం ఎప్పటికప్పుడు డైలామాలో పడిపోతున్నాడు. ఇప్పుడు బద్వేలు అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తెస్తాడో? ఆల్రెడీ తన
ఎంపీ అవినాశ్
రెడ్డి 120 కోట్లతో బద్వేలు అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని చెప్పాడు సరే! అంత డబ్బు ఇప్పటికిప్పుడు యాడ నుంచి తెస్తారో ఆ తిర్పతి సామికే తెల్వాల?