హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ పార్క్ ముందు కారు అదుపు తప్పింది. అతివేగంగా వచ్చిన కారు.. ట్యాంక్ బండ్ రోడ్‌లో దూసుకెళ్లింది.. అదుపు తప్పి హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్పంగా  గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. పాపం.. నాలుగు రోజుల క్రితమే ఈ కారు కొన్నట్టు తెలుస్తోంది. కొత్త కారుతో ఉదయమే టిఫిన్ చేద్దామని ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ వెళ్తున్నట్టు తెలిసింది. ప్రమాదంలో కారు చాలా వరకూ దెబ్బతిన్నది. నెక్లెస్‌ రోడ్‌లో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


కొత్తగా కారు కొంటే ఎంతో అపురూపంగా చూసుకుంటాం.. ఓ చిన్న గీత పడితేనే ఎంతగానో ఫీలవుతాం.. కారుకు కొత్త హంగులు చేకూర్చి ఆనందిస్తాం.. అలాంటిది.. కారు కొన్న నాలుగో రోజే ప్రమాదానికి గురైతే.. ఆ బాధ చెప్పలేం..

మరింత సమాచారం తెలుసుకోండి: