ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మ‌సాలాపై  ఓ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్న‌ది. డిసెంబ‌ర్ 7 నుండి దాదాపు సంవ‌త్స‌రం కాలం పాటు న‌మిలే పొగాకు, పాన్‌మ‌సాలా, తంబాకు, గుట్కా వంటి వాటిపై నిషేదం విధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కుటుంబ సంక్షేమ, ఆహార భ‌ద్ర‌త శాఖ క‌మిష‌న‌ర్ కాట‌మ‌నేని భాస్క‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేసారు. నికోటిన్ క‌లిపిన ఆహార ఉత్ప‌త్తులు అయిన వాట‌న్నింటినీ ప్ర‌భుత్వం బ్యాన్ చేసిన‌ట్టు ఉత్త‌ర్వుల‌లో వెల్ల‌డించారు. ఏ పేరుతో కూడా త‌యారు చేయ‌డం, స‌ర‌ఫ‌రా చేయ‌డం, నిలువ చేయ‌డం నేరం కింద ప‌రిగ‌ణించింది ఏపీ ప్ర‌భుత్వం. ఒకవేళ ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మించినట్ట‌యితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్పవు అని కూడా కుటుంబ సంక్షేమ, ఆహార భ‌ద్ర‌తశాఖ క‌మిష‌న‌ర్ కాట‌మ‌నేని భాస్క‌ర్ హెచ్చ‌రించారు.

మ‌రోవైపు తెలంగాణ‌లో కూడా గుట్కా, పాన్ మ‌సాలాపై ప్ర‌భుత్వం నిషేదం విధించిన విష‌యం విధిత‌మే. అయితే ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలో గుట్కా నిషేదాన్ని స‌వాల్ చేస్తూ హై కోర్టులో దాదాపు 160 పిటిష‌న్లు దాఖ‌లు అయిన‌ట్టు స‌మాచారం. వీట‌న్నింటినీ హై కోర్టు కొట్టివేస్తూ తీర్పును వెల్ల‌డించింది. క‌రోనా గుట్కా వ‌ల్ల‌నే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నార‌ని.. హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: