విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్ర‌యివేటు ప‌రం చేసేందుకు  ఇప్ప‌టికే సిద్ద‌మైన‌ది కేంద్రం.  అటు కేంద్ర క్యాబినెట్  కూడా నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విధిత‌మే.  విశాఖ ఉక్కును ఎప్పుడు అయితే  ప్ర‌యివేటు ప‌రం చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయో.. అప్ప‌టి నుంచే ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, దీక్ష‌లు, పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.  అయిన‌ప్ప‌టికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న మాత్రం రాలేదని ప‌లువురు పేర్కొంటున్నారు.  ఏపీ రాష్ట్రంలో అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ, ఇత‌ర పార్టీలు కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి.

విశాఖ ఉక్కును ప్ర‌యివేటు ప‌రం చేస్తే ఊరుకునేది లేద‌ని జ‌న‌సేప పార్టీ సైతం గ‌తంలోనే  పేర్కొన్న విష‌యం తెలిసిన‌దే.  కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌ది.  ఇప్పుడు విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష చేయ‌బోతున్నారు.  మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిసెంబ‌ర్ 12న అన‌గా ఎల్లుండి దీక్ష చేయ‌బోతున్నారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు పీఏసీ స‌భ్యులు, జిల్లాల పార్టీ నేత‌లు దీక్షలో పాల్గొన‌నున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష‌పై బీజేపీ, అధికార వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో  వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: