గుంటూరు జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ నెల 12 వ తేదీ దుర్గి మండలం ఆడిగొప్పలు వద్ద  సాగర్ కుడి కాలువలోకి మాచర్ల శాసన సభ్యుడు పిన్నెపల్లి రామకృష్ణారెడ్డి సమీప బంధువుల కారు దూసుకెళ్లిన ఘటన మరువక ముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎక్కడో తెలుసా ?
గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణాయపాళెం నుంచి వెళుతున్న కారు ఎర్రబాళెం చెరవులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు వెంటనే  పరుగు పరుగున అక్కడికి చేరుకుని కారు అద్దాలను పగుల గొట్టారు. కారులోని నలుగురు వ్యక్తులను వెలికి తీశారు. అప్పటికే వారు విగత జీవులయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  మృతి చెందిన వారు మంగళగిరికి చెందిన నరేంద్ర, శ్రీనివాస్, సాయిగా గుర్తించారు. మరో వ్యక్తి ఎర్రబాళెం గ్రామ వాసి రాంజీ గా గుర్తించి, వారి బంధువులకు సమాచారం ఇచ్ఛారు. వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరగడం జిల్లా వాసుల్లో విషాదాన్ని నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: