దీంతో.. సోము వీర్రాజు దిద్దుబాటు చేసుకుంటున్నారు. రాయల సీమ వాసులకు క్షమాపణలు చెప్పారు. రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం అన్న సోము వీర్రాజు.. ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో సీమ ప్రజల మనుసులు గాయపడ్డాయని తెలిపారు.
ఆ సందర్భంలో నేను వాడిన పదాలు వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని.. రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తున్నానని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
అనేక వేదికలపై ప్రస్తావిస్తున్న విషయం రాయలసీమ ప్రాంత వాసులకు తెలుసన్న సోము వీర్రాజు.. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చాలాసార్లు ప్రస్తావించానన్నారు.రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని బీజేపీ ఆలోచన అని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి