క్రమంగా ఉక్రెయిన్‌పై పైచేయి సాధిస్తున్న రష్యా ఇప్పుడు మరో కీలక ప్రాంతంపై దృష్టి సారించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లీసీచాన్స్క్‌పై పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తోంది. అందు కోసం ఆ ప్రాంత దగ్గరలోని సీవీరోదొనెట్స్క్‌పై కొన్ని వారాలుగా నిరంతరంగా దాడులు చేసింది. చివరకు అక్కడి నుంచి ఉక్రెయిన్‌ సేనలు వైదొలగేలా చేసింది. ఆ తర్వాత లీసీచాన్స్క్‌ దిశగా రష్యా సేనలు ప్రయాణం చేస్తున్నాయి.


ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తూర్పు ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న ఉక్రెయిన్ నగరాలపైనా దాడులు తీవ్రం చేస్తోంది. రష్యా నిరంతర దాడులతో  సీవీరోదొనెట్స్స్‌ ప్రాంతం శిథిలాల మయంగా మారిపోయింది. 10 లక్షల మంది జనాభా ఉండే సీవీరోదొనెట్స్స్‌ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఆ నగరంలో 10,000 మంది ఉంటే గొప్ప అన్నట్టుగా ఉంది. ఇప్పటికే డాన్‌బాస్‌ ను దక్కించుకున్న రష్యా ఇప్పుడు సీవీరోదొనెట్స్క్‌ను దక్కించుకుంది. ఇక లీసీచాన్స్క్‌ దిశగా కదులుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: