పోటీ పరీక్షలకు సిలబస్‌ చాలా ఎక్కువగా ఉంటోంది. కానీ అభ్యర్థులకు ప్రిపరేషన్ సమయం తక్కువగా ఉంటోంది. అలాంటప్పుడు చదవడంలో టెక్నిక్‌ తెలుసుకోవాలి. ఒక లెస్సన్ ఎలా చదవాలో తెలుసుకోవాలి. దీనికి ఓ టెక్నిక్‌ ఉంది. ఏదైనా పాఠం చదివేటప్పుడు.. పాఠం మొదలు పెట్టి చదువుకుంటూ పోవద్దు.


ముందు పాఠం మొత్తం హెడ్డింగ్స్, సబ్‌ హెడ్డింగ్స్‌ మాత్రమే పైపైన చదువుకుంటూ పోవాలి. పాఠంలో ఉన్న పటాలు చూడాలి. చివర ఉన్న ఎక్సర్‌సైజ్‌ పైపైన చదవాలి. దీని వల్ల మీకు ఆ పాఠంలో ఏముందో ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత.. ప్రతి హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్‌ పక్కన ఉన్న మొదటి రెండు వాక్యాలు చదివుకుంటూ పోవాలి. దీనివల్ల మీకు 60 శాతం కాన్సెప్టు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఉండేదంతా 40 శాతం సపోర్టింగ్ మాత్రమే. ఆ తర్వాత మొత్తం పాఠం చదువుతూ అందులోని కీవర్డ్స్‌ అండర్‌లైన్ చేసుకోవాలి.


ఇలా చేయడం వల్ల రివిజన్ సమయంలో తక్కువ టైమ్‌ పడుతుంది. ఆ తర్వాత.. చదివే పాఠానికి సంబంధించి ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్ సమాచారం కూడా  పక్కన రాసుకోవాలి. ఏదైనా పాఠంలో 80 శాతం గ్రామర్‌ కే పోతుంది. మిగిలిన 20 శాతం కంటెంట్‌ అసలైంది ఉంటుంది. ఆ 20 శాతం పట్టుకోవాలి. ప్రశ్నలు సొంతంగా తయారు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: