వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ మానసిక పుత్రికగా చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా పౌర సేవలను జగన్ సర్కారు జనం ఇంటివద్దకే తీసుకొచ్చింది. అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ వాలంటీర్లకు మరో బాధ్యత అప్పగించబోతున్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేయాలని నిర్ణయించిన సీఎం..అందులో వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు.

ధాన్యం సేకరణ పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఆదేశించిన సీఎం.. ధాన్యం సేకరణలో వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. అంతే కాదు..  వారి సేవలను వినియోగించుకున్నందుకు ప్రోత్సాహకాలు కూడా అందించాలని నిర్ణయించారు. దీని కోసం ఎస్‌ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.  సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు వాటిని సీఎంకు వివరించారు. దీనిద్వారా వాలంటీర్లకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: