ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో పర్యటించనున్నారు. నరసాపురం ఆర్టీసీ బస్టాండు, నాడు-నేడు కింద ఆధునీకరించిన 50 పడకల ఆస్పత్రి, విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఫిషింగ్ హార్బర్, ఆక్వా విశ్వవిద్యాలయాలకు  సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో....జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయ్యాలని జిల్లా కలెక్టరు ప్రశాంతి అధికారులను ఆదేశించారు.


నక్కావారి పేట వీవర్సు కాలనీలో ముఖ్యమంత్రి పాల్గొనున్న బహిరంగ సభా వేదికను, చినమామిడి లే అవుట్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. చినమామిడిపల్లి  హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకూ రహదారులు, పట్టణమంతా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, పూల మొక్కలతో సుందరీకరణ చేయాలని అధికారులకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: