సామాజిక లక్ష్యంతో పనిచేస్తున్న గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించటంపై గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం మహిళా ఉద్యోగుల సదస్సులో ఇలా అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు దొరికే పరిస్థితి కష్టమవుతుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి అన్నారు.


దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకులుగా చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక రంగానికి, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి  తెలిపారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అనేక పోరాటాలను చేపడుతున్నామని వాటిలో మహిళా ఉద్యోగులను భాగం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: