తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ వాటిలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. అంతే కాదు.. ఈ పర్యాటక ప్రాంతాలకు మరికొన్ని సొబగులు అద్దితే పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. అందుకే ఏపీ టూరిజం శాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణ లోని ఈగలపెంట - శ్రీశైలం రోప్‌వే ప్రాజెక్టు కోసం కృషి చేస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఈగలపెంట - శ్రీశైలం రోప్‌వే ప్రాజెక్టును 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రాజెక్టు నిర్మిస్తారు. జాతీయ రహదారుల సంస్థ తో పర్యాటక ప్రాజెక్టుల పై ఈమేరకు ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది.  33 కి.మీ.ల పొడవైన రోప్‌వే ప్రాజెక్టుల కోసం 26  ప్రదేశాలను గుర్తించారు. దీనిపై నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని రోప్‌వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పర్వతమాల పరియోజన పథకం కింద రోప్‌వే ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయబోతున్నామని ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: