చంద్రబాబు ఇటీవల కొన్ని ఎన్నికల హామీలు ప్రకటించారు. ఈ హామీలు గేమ్‌ ఛేంజర్‌ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే వాటిని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన పథకాల్లో ఒక్కటన్నా ఆయన ఆలోచన ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పథకాలు ఇస్తుంటే విమర్శించిన ఈ చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలతో మేనిఫెస్టో ఇస్తున్నాడని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.


చంద్రబాబు మహానాడులో చెప్పిన పథకాల్లో ఒక్కటన్నా ఆయన సొంత ఆలోచన ఉందా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రెండు హామీలు జగన్‌ గారివి కాపీ కొట్టాడని.. ఒకటి కర్నాటక నుంచి, మరొకటి గోవా నుంచి కాపీ కొట్టాడని వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర అయినా ఉందా అంటే అదీ లేదని అంటున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోవడానికి ఓట్లేయడానికి జనం పిచ్చోళ్లు కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: