ఏపీలో మహిళల కిడ్నాప్‌లకు పవన్‌ కల్యాణ్‌ కారణమా.. ఇప్పుడు వైసీపీ నేతలు ఓ కొత్త వాదనకు తెర తీస్తున్నారు. ప్రేమ‌ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారంటున్న వైసీపీ నేతలు.. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌ కూడా అనేక ప్రేమ స్టోరీలు తీశారు. అందువల్ల ఇలాంటి అదృశ్యాలకు పవన్‌ కూడా ఓ కారణం అన్నది వైసీపీ నేతల సూత్రీకరణ.


అలాగే తప్పిపోయిన వారిలో 78 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రిక‌వ‌రీలో హ‌య్య‌స్ట్ స్టేట్‌గా ఉన్న ఏపీ గురించి పవన్‌ మాట్లాడ‌డం లేదని వారు అంటున్నారు. కేవ‌లం తనకు అనుకూల‌మైన కోణాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడని... వ‌లంటీర్ వ్య‌వ‌స్థ దీనికి కార‌ణ‌మ‌ని కుట్ర పూరిత‌మైన ఆరోప‌ణ‌ను ప‌వ‌న్ చేశాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: