హైదరాబాద్‌ మెట్రో రైలును విస్తృతం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.   మూడు, నాలుగేళ్లలో మెట్రో రైలును భారీగా విస్తరించాలని నిర్ణయించిన కేసీఆర్‌ సర్కార్‌.. రాయదుర్గం-విమానాశ్రయం మెట్రో రైలు టెండర్‌ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. ఇక విస్తరణలో భాగంగా జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు  డబుల్‌ డెక్కర్‌ మెట్రో, ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో విస్తరణ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.

దీంతో పాటు మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించారు. అలాగే ఉప్పల్‌ నుంచి బీబీ నగర్‌ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించిన కేసీఆర్ సర్కారు భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. అలాగే ఉప్పల్ నుంచి ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరించనున్నారు. అలాగే పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తి చేస్తామని కేసీఆర్‌ సర్కారు చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: