ప్రపంచంవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రస్తుత పోటీ తట్టుకునేలా సాంకేతికత అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై మూడో రోజూ కూడా మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. ఇందులో టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌, ఆగ్రోస్, మార్క్‌ఫెడ్‌, హాకా వంటి 14 సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్పోరేషన్ల పనితీరు, రైతులకు అందుతున్న సేవలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై మంత్రి తుమ్మల విస్తృతంగా చర్చించారు.

ఈ కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్ధతులు అవలంభించాలని.. వ్యవసాయ పంటల సాగులో ఇతర దేశాలు అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలు మనం అలవరుచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి అత్యాధునిక పద్దతులు అందిపుచ్చుకుని రైతులకు లబ్ధిచేకూర్చేలా పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. కార్పొరేషన్లు కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేయవద్దని... రైతులకు ఉపయోగపడేలా విధానాలు అమలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: