వైసీపీ ఐదో జాబితా విడుదల చేసింది.  3 అసెంబ్లీ, 4 లోక్ సభ అభ్యర్థులతో 5వ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. తిరుపతి లోక్‌సభకు  తిరిగి గురుమూర్తినే నియమించింది. తిరుపతి సిటింగ్‌ ఎంపీ గురుమూర్తిని ఈనెల 11న సత్యవేడు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినా.. మళ్లీ మార్చేసింది. సత్యవేడులో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలంను ఆయన వద్దంటున్నా తిరుపతి లోక్‌సభకు మార్చారు. మంత్రి పెద్దిరెడ్డి కుట్ర చేసి తనను సత్యవేడు నుంచి బయటకు పంపారని ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గురుమూర్తిని మళ్లీ తిరుపతి లోక్‌సభకే మారుస్తున్నట్లు వైసీపీ  ప్రకటించింది.


అలాగే అరకులో మాధవిని తప్పించి మత్స్యలింగంను వైసీపీ నియమించింది. అంతే కాదు.. ఎంపీ మాధవికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. ఇక నెల్లూరు నుంచి నరసరావుపేటకు అనిల్‌ కుమార్ యాదవ్‌ను బదిలీ చేశారు.కాకినాడ లోక్‌సభ ఇన్‌ఛార్జిగా సునీల్‌ ను వైసీపీ నియమించింది. మచిలీపట్నానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను నియమించారు. అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్‌ పేరును వైసీపీ ప్రకటించింది. సత్యవేడులో శాసనసభ మాజీ ఉపసభాపతి కుతూహలమ్మ సోదరి కొడుకైన నూకతోటి రాజేష్‌ను నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: