ప్రతి రాజకీయ నాయకుడికి అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అని ఒక్కసారైనా అనాలని ఉంటుందని అంటారు. కానీ.. ఈ కోరిక అటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కానీ.. ఇటు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ కు కానీ ఇంత వరకూ నెరవేరలేదు. పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టి ఏకంగా పదేళ్లు అయ్యింది.. కానీ ఇంత వరకూ ఎమ్మెల్యే కూడా కాలేదన్న అపకీర్తి మాత్రం ఆయన్ను వెంటాడుతోంది. అందుకే ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లి తీరాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారు.

అటు లోకేశ్ పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిందే.. ఆయన కూడా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి  దాదాపు పదేళ్లు అవుతోంది. కానీ ఇంత వరకూ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పవన్ కల్యాణ్‌ భీమవరం, గాజువాక రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈ ఎన్నికల్లో అయినా ఈ ఇద్దరు నేతల కల నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: