సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అందుకు అనుగుణంగా వైసీపీని తమ ట్రాప్ లోకి చంద్రబాబు లాగుతున్నారు. ముందు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు. దీనికి ప్రతిగా వారు కూడా ఘర్షణలకు తెగ పడుతున్నారు.  తాజాగా మంగళగిరి లో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


మా పార్టీ బలమైనదే అయినా తాము సంయమనంతో ఉన్నాం. ఈ విషయాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి. నిగ్రహంగా ఉండటాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు. నిజంగా తాము కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై తిరగలేరు. ఇది పద్ధతి కాదు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒకవేళ వైసీపీ సంయమనం కోల్పోయి దాడులు చేస్తే టీడీపీకి లాభం చేకూరుతుంది. దీనిని ఎల్లో మీడియా అనుకూలంగా మలచుకొని చంద్రబాబుకి కావాల్సిన మైలేజ్ ఇస్తుంది. మరి వైసీపీ టీడీపీ ట్రాప్ లో పడుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: