కూటమి నేతలు ఎన్నికల అనంతరం కూర్చొని పోలింగ్ సరళిపై చర్చించింది లేదు. ఎవరికీ వారు సొంతంగా కూటమి 160 స్థానాలకు పైగా.. 130 కి పైగా గెలుస్తున్నాం అని ప్రకటనలు ఇచ్చేశారు. మరి ఇది ఏ ప్రాతిపాదికన చెప్పారు అంటే దీనికి సమాధానం ఉండదు. కానీ సీఎం జగన్ అలా కాదు. మూడు రోజుల పాటు పూర్తిగా కసరత్తులు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా జరగిని పోలింగ్ సరళిని గమనించి బూత్ ల వారీగా డేటాను తెప్పించుకొని దీనిపై సమీక్షలు జరిపారు. లెక్కలు వేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో  80-90 శాతం వరకు పోలింగ్ నమోదైంది.  ఓసీలు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ ల్లో 75-85 శాతం వరకు ఓట్లేశారు.  ఇక్కడ కులాల వారీగా మహిళలు ఎంత మంది ఉన్నారు. తమకు లాభించే అవకాశాలు ఏంటి? మహిళలు, వృద్ధులు వైసీపీకే ఓటు వేశారా వంటి అంశాలను నిర్ధారించుకొని సీఎం జగన్ ఐ ప్యాక్ ఆఫీస్ కు వచ్చి దేశం నివ్వెరపోయేలా ఫలితాలు ఉంటాయని ప్రకటించారు. మరి ఇవి నిజం అవుతాయా లేదా అంటే వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: