జగనన్న కాలనీ భూముల్లో మాజీ మంత్రి విడదల రజిని అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి ప్రత్తిపాటిని కలిసిన పసుమర్రు రైతులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి తీసుకున్న 160 ఎకరాల్లో రూ.10 కోట్ల అవినీతికి పాల్పడ్డారని పసుమర్రు రైతులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. విడదల రజిని కాజేసిన తమ డబ్బులు ఇప్పించాలని ప్రత్తిపాటిని కోరిన పసుమర్రు రైతులు కోరారు.


రజినిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రత్తిపాటి పుల్లారావుకు పసుమర్రు రైతులు  వినతి పత్రం ఇచ్చారు. వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలు అతి పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతుల పేరుతో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. భూమి కొనుగోలులో రూ.వందల కోట్లు చేతులు మారాయన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమర్రు రైతులకు న్యాయం చేస్తానన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: