ఏపీ సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే ఏపీ ఉల్లి విదేశాలకు ఎక్స్ పోర్ట్ అవుతుంది. ఈ మేరకు సహకరించాలని ఏపీ సీఎం జగన్.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కు లేఖ రాశారు. అంతే కాదు.. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, రెడ్డప్ప, రంగయ్య పీయూష్‌ గోయల్‌ ను కలిసి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు.

 

కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతించాలని పీయూష్ గోయల్ ను ఎంపీలు కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పీయూష్‌ గోయల్‌ను కలిసినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు.

 

కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యను మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతి కోసం సీఎం వైయస్‌ జగన్‌ లేఖ కూడా రాశారని చెప్పారు. మా వినతిపై పీయూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందించారని మిథున్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే ఉల్లి ఎగుమతికి అనుమతి వస్తుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇదే నిజమైతే ఏపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం ఉల్లి రైతుల కష్టాలూ తీరతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: