రైతుల కలలను సాకారం చేసేందుకు మోదీ సర్కార్ అహర్నిశలు కష్టపడుతున్నారు.. కిసాన్ పథకాన్ని ప్రారంభించారు.. ఈ పథకం ద్వారా రైతులకు కొత్త రుణాలను అందిస్తున్నారు. ఇకపోతే ఇటీవల పశువులను కూడా కొనుగోలు చేయవచ్చునని శుభవార్త చెప్పారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.. రైతులకు రెట్టింపు వస్తుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన పథకాల ద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. సాంకేతిక రంగం లో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.ఓవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళన 17వ రోజూ కొనసాగుతోంది. కేంద్రం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.  మోదీ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం చేకూరింది..



ఈ కొత్త చట్టాల ద్వారా ప్రజలకు లబ్ది పొందేందుకు వీలుగా ఉంటుంది. ఎక్కడైనా, ఎలాగైనా అమ్ముకోవచ్చు లాభాలను ఆర్జించవచ్చు అని మోదీ స్పష్టం చేశారు. త్వరలో శీతల గిడ్డంగులను ఆధునికీకరించనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశం తోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని తెలిపారు. రైతులకు లాభాలను చేకూర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అంటున్నారు.



రాజధాని సరిహద్దు లో రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికైనా ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈరోజు విజ్ఞప్తి చేశారు. మరోవైపు చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ అంగీకరించబోమని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. చట్టాలను ఉపసంహరించే వరకు ఇంటికెళ్లేది లేదని తేల్చి చెబుతున్నాయి. మరి ఈ విషయం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి.. ఎవరు ఎవరిని బుజ్జగిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: