షేర్ మార్కెట్  ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్ధం కాదు. ఈ షేర్ మార్కెట్ లో వ్యాపారం చేసేవారు ఎంతో అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరం ఉంది. నిముషాల సమయంలోనే షేర్ మార్కెట్ లు షాక్ ఇస్తుంటాయి. దీనికి చాలా అంశాలు కారణం కావొచ్చు. అందుకే మార్కెట్ లో జరిగే అంశాలపై ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈ షేర్ మార్కెట్ ప్రపంచంలో అనుకోకుండా చాలా విషయాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మంచి మంచి కంపెనీలు సైతం బోల్తా కొడుతుంటాయి. లక్షల కోట్లలో నష్టాలను చవిచూస్తుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా ఒక విషయం సంచలనంగా మారుతోంది. భారత పారిశ్రామిక దిగ్గజ ప్రముఖులలో ఒకరైన గౌతమ్ అదానీ కంపెనీలకు చెందిన షేర్లను ఎవ్వరూ కొనడానికి ముందుకు రావడం లేదు. దీనితో ఒక్కసారిగా అదానీ గ్రూప్ తీవ్ర సందిగ్ధంలో పడింది. అయితే ముఖ్యంగా ఒక్క కారణం వలన ఇది జరిగినదని తెలుస్తోంది.

 ఈ అదానీ గ్రూప్ షేర్ లలో ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం విదేశీ పెట్టుబడిదారులపై అదానీ గ్రూప్ కొన్ని ఆంక్షలు పెట్టినట్లుగా వార్త ప్రచారంలో ఉంది. కానీ వాస్తవానికి అదానీ గ్రూప్ ఇలాంటిదేమీ చేయలేదని ఇన్వెస్టర్లకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీనితో అదానీ గ్రూప్ షేర్ లను అమ్మకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కూడా అమ్మకాలు భారీగా పెరిగినట్లుగా సమాచారం. ఈ అదానీ గ్రూప్ కంపెనీల్లో ఫ్లాగ్ షిప్ కామపీనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలుదారులపై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో 10 లక్షల షేర్లు అమ్మకానికి ఉన్నా కొనేవారు కేవలం 4 లక్షల వరకే ఉన్నారు. ఈ షేర్ నిన్న ఎక్కడ అయితే ఆగిపోయిందో అక్కడే ట్రేడ్ అవుతోంది. ఇదే గ్రూప్ లో ఉన్నా ఇంకో కంపెనీ అదానీ ఎనర్జీ ఎంతొహ్ కష్టం మీద 2 రూపాయలు పెరిగింది. ఇక్కడ కూడా కొనే వారి కన్నా అమ్మేవారు అధికంగా ఉన్నారు. ఇంకా మిగతా మూడు కంపెనీల్లో కొనుగోలు దారులే లేకపోవడంతో లోయర్ సీలింగ్ వద్ద ట్రేడింగ్ లో ఉన్నాయి.
 
అదానీ ట్రాన్స్మిషన్ షేర్ నిన్నటికన్నా ఈ రోజు 5 శాతం నష్టంతో రూ . 1446 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక్కడ మొత్తం 3,77 , 027 షేర్ లు అమ్మకానికి సిద్ధంగా ఉండగా, కొనే నాధుడే కనిపించడం లేదు. అదానీ కౌంటర్ లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఈ విధంగా అదానీ గ్రూప్ కు చెందిన కంపెనీలలో షేర్లు అమ్మకానికి రెడీగా ఉన్నప్పటికీ కొనుగోలు దారులు మాత్రం లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి మరొకటి కూడా కారణంగా అనిపిస్తోంది. కొద్ది రోజుల ముందు వరకు ఈ కంపెనీలకు చెందిన షేర్లు భారీగా పెరగడంతో బ్రోకర్లు అందరూ ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ షేర్లను కొనవద్దని సలహా ఇచ్చారట. దీనితో అందరూ అదానీ గ్రూప్ షేర్లను బ్లాక్ మార్క్ చేశారని తెలుస్తోంది. అదానీ గ్రూప్ మాత్రం విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించి విఆవ్రణ ఇస్తున్నప్పటికే, దీనిపై అటు సెబీ కానీ లేదా ఎన్ఎస్డిఎల్ కానీ స్పందించకపోవడం గమనార్హం. ఇంకా ఎన్ని రోజులు ఈ షేర్ల అమ్మకాలు పెరుగుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: