భారత దేశీయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఎక్కువగా వినిపించే బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఈ బ్యాంక్ ప్రయివేట్ రంగానికి చెందిన వాణిజ్య బ్యాంక్.. తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తూ వస్తుంది. కాగా, తాజాగా తన కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ పంపింది. బ్యాంక్ సేవలకు అంతరాయం కలగడం ఇందుకు ముఖ కారణంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు స్వయం గా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.


మొబైల్ బ్యాంకింగ్ యాప్‌కు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ అంశం పైనే పని చేస్తున్నాం. కస్టమర్లు లావా దేవీల నిర్వహణ కోసం నెట్ బ్యాంకింగ్ ఉపయోగించాలి. మొబైల్ బ్యాంకింగ్ అంతరాయానికి చింతిస్తున్నాం. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కరిస్తాము అని బ్యాంక్  టెక్నీకల్ టీం వెల్లడించింది. ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది మొబైల్ బ్యాంకింగ్ ను ఉపయోగిస్తున్నారు.


ఒక్క నిమిషం ఆగిపోయిన కూడా ఎన్నో నష్టాలూ జరుగుతాయని ఖాతాదారులు గతంలో చాలా సార్లు ఫిర్యాదులు అందజేశారు. మళ్ళీ ఇలాంటి సమస్యలు తలెత్తడం ఇది కొత్తేమీ కాదు. ఇది వరకు కూడా చాలా సార్లు బ్యాంక్ కస్టమర్ల కు ఇలాంటి సౌకర్యం కలిగింది. దీంతో ఆర్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. ఒక కంపెనీ తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి ప్రత్యేక ఆడిట్ ను పరిశీలిస్తుంది. ఈ సమస్య ఎప్పటికి క్లియర్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఈ బ్యాంక్ ద్వారా ఎక్కువ కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కు జీతాలను అందిస్తున్నాయి. చాలా మంది పర్సనల్ గా కూడా ఈ బ్యాంక్ ఖాతాలను వాడుతున్నారు. మరి బ్యాంక్ ఇలా అజాగ్రత్తగా ఉండటం ఏంటో అని కొందరు విమర్శిస్తున్నారు.. ఎస్బిఐ బ్యాంక్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: