ఎవరు ఎంత చిన్న పని చేశారు అనేది కాకుండా వాళ్ళు ప్రస్తుతం ఎంత ఎత్తుకు ఎదిగారు అనేది లెక్క కట్టవలిసి ఉంటుంది ఎవరైనా. కానీ అది చేసేవారు చాలా తక్కువ. గతంలో చేసిన పనిని బట్టి ఇప్పుడు ఎంత హోదా పెరిగినా సరే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చాయ్ అమ్ముకునేవారనే విషయం అందరికీ తెలిసిందే.


ఆ సాకు చూపించే ఇప్పుడు చాలామంది ఆయన భారత ప్రధాని అయినా సరే ఆ రకంగానే విమర్శిస్తూ ఉంటారు. అసలు ఆయనకి ఏమి తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. నిజం చెప్పాలంటే ఆయన వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది అనే వాదన వినిపిస్తోంది.  ఇది కేవలం నోటిమాట కాదు, అలా అని అభివృద్ధి గణాంకాలే చెబుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారని.. అయినా భారత్ టాప్ ఫైవ్ లోకి ఎందుకు రాలేకపోయిందో తెలియదని అంటున్నారు.


సుదీర్ఘంగా ఉన్న ఆర్థిక మంత్రి  చేతిలో భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు నెంబర్ వన్ గా మారలేదు అనేది ఒక  పెద్ద ప్రశ్నగా మారిందంటున్నారు బీజేపీ నేతలు. ఆర్థిక సంస్కరణలు పెద్ద ఎత్తున మొదలుపెట్టిన వ్యక్తి పీవీ నరసింహ రావు లాంటి వ్యక్తి హయాంలో కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రోడ్లు వెయ్యలేకపోయారు, రహదారులు చేయలేకపోయారు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.


అసలు జీడిపి రేటింగ్ లో భారత్ ఎక్కడ  ఉంది. గతంలో  ఎంత పెద్ద మేధావుల పరిపాలనలోనైనా సరే ఈ జీడీపీ రేటింగ్ విషయంలో  వెనుక పడిపోయే ఉన్నామని.. కానీ ఇప్పుడు అదంతా ఒక గతం. వర్తమానం ఒక వరం. కరోనా వచ్చిన ఏడాది విషయం పక్కన పెడితే కరోనా తర్వాత జీడిపిలో ప్రపంచంలోనే నంబర్ వన్ లోకి చేరుకున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. గత ఏడాది 7.6%తో, ఈ ఏడాది  6.5%తో భారత్ వెలుగుతుందని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: