పర్సనల్ లోన్ ఇవ్వడానికి అన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తాయి. అయితే ఈ వసూలు అనేది రుణదాతకు అనుగుణంగా మారుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం రుసుము ఇంకా వర్తించే పన్నులను విధిస్తుంది. అయితే యాక్సిస్ బ్యాంక్ అనేది 0.5-2.5 శాతం నుంచి ఏదైనా వసూలు చేస్తుంది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ సుమారు 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లోన్ మొత్తంలో 1 శాతం ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తుంది, అయితే కనిష్టంగా రూ. 1,000+ జీఎస్టీ ఇంకా గరిష్టంగా రూ. 10,000+ జీఎస్టీ వసూలు చేస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 4,999 దాకా ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నులను వసూలు చేస్తుంది.ప్రాసెసింగ్ ఛార్జీలతో పాటు స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ఇంకా ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా జరిమానా ఛార్జీలు (మీరు గడువు తేదీలో మీ ఈఎంఐ కట్టకపోతే వర్తిస్తుంది) కలెక్షన్ ఛార్జీలు (బ్యాంక్ మీకు చెల్లించాల్సిఉంటే) వంటి ఇతర ఛార్జీలను కూడా బ్యాంకులు విధించే అవకాశం ఉంది. ఇక స్టాంప్ డ్యూటీ ఛార్జీలు సాధారణంగా వర్తించే రేటులో విధిస్తారు. అయితే ఇతర ఛార్జీలు సాధారణంగా రూ. 200-500 లిమిట్ లో ఉంటాయి. కొన్ని బ్యాంకులు గడువు దాటిన ఇన్‌స్టాల్‌మెంట్‌పై వడ్డీగా ఈఎంఐలను కోల్పోయినందుకు పెనాల్టీని కూడా వసూలు చేస్తాయి. ఒకవేళ మీరు మీరు మీ లోన్‌ను ముందస్తుగా చెల్లించాలని అని కనుక నిర్ణయించుకుంటే ఫోర్‌క్లోజర్ ఛార్జీ అనేది మీకు ఉంటుంది. ఇది బకాయి ఉన్న ప్రిన్సిపల్‌పై జీఎస్టీతో పాటు 2-5 శాతం మధ్య ఎంతైనా కూడా ఉండవచ్చు.


టాప్-అప్ లోన్‌ల ఆఫర్‌లతో తక్కువ వడ్డీ రేట్లు లేదా ఇలాంటి ఇతర ఆఫర్‌లతో మిమ్మల్ని అట్రాక్ట్ చెయ్యొచ్చు. అయితే ఇలాంటి ఆఫర్ల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. మీకు ఆ టాప్-అప్ లోన్ అవసరం లేకపోతే తీసుకోకపోవడం మంచిది. కొన్ని సమయాల్లో రుణాలు ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై కూడా ఆధారపడి ఉండవచ్చు. ఇది మొదట్లో ఫిక్స్డ్ వడ్డీ రేటు కంటే తక్కువగా అనిపించవచ్చు, కానీ వడ్డీ రేటు పెరుగుదల చివరికి ఈ రుణాలను ఫిక్స్డ్ వడ్డీ రేటుపై ఇచ్చే రుణాల కంటే ఖరీదైనదిగా చేస్తుంది. కాబట్టి, లోన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఫైన్ ప్రింట్ చదవాలి.లోన్ తీసుకోవడం చాలా సులభం అయితే మీరు చివరికి దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా సమస్య కారణంగా పెద్ద మొత్తంలో లోన్ తీసుకుని దాన్ని తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్‌గా ఉంటే అది మీ క్రెడిట్ రేటింగ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాకుండా మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లోకి కూడా లాగుతుంది. ఇక అలాంటప్పుడు లోన్ డిఫాల్ట్ కారణంగా మీరు జరిమానాలతో పాటు చట్టం ప్రకారం రిస్క్ ప్రాసిక్యూషన్‌కు కూడా సొమ్ము కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: