ఈ సంఘటన తెలిస్తే సభ్య సమాజం సిగ్గు పడాల్సి వస్తుంది. ఎంతో చదివి విద్యాబుద్ధులు నేర్చుకుని పది మందికి చదువు చెప్పి గాడిలో పెట్టాల్సిన  ఆ ఉపాధ్యాయుడికే బుద్ధి గడ్డితిన్నది. గురువు అనే పదాన్ని పాతర పెట్టి మృగంలా మదమెక్కి కొట్టుకుంటున్న ఆ ఉపాధ్యాయుడికి తోటి టీచర్ పై కన్ను పడింది. ఎలాగైనా ఆమెను అత్యాచారం చేయాలని డిసైడ్ అయ్యాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించి ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి ఇంతకీ ఆ కీచక ఉపాధ్యాయుడు ఎవరు మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..! సమాజంలో మహిళల పై అత్యాచారాలు అనేవీ రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అది నేరప్రవృత్తి ఉన్నవారు చేశారంటే వారికి అలవాటు ఉన్నదని అనుకోవచ్చు.

కానీ ఉన్నత స్థానంలో ఉండి కూడా ఇలాంటి దురాగతాలకు పాల్పడే వారిని ఏం చేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక మహిళ టీచర్ ను చంపుతానని బెదిరించి  అత్యాచారానికి పాల్పడ్డాడు తోటి ఉపాధ్యాయుడు. అతను మళ్లీ ఒక సంఘానికి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న వ్యక్తి. ఆమెను చంపేస్తానని బెదిరించి సెల్ఫోన్ కూడా లాక్కొని చివరికి పరారయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నివసించే బానోత్ కిషోర్ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని గూడెం పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతని భార్య కూడా ఉపాధ్యాయురాలు కావడంతో వారిద్దరూ కారులో ప్రతి రోజు పాఠశాలకు వెళ్లేవారు. అయితే అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివాసం ఉంటున్న  ఉపాధ్యాయురాలు డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో వెళ్లి అక్కడ్నుంచి స్కూటీపై స్కూల్ కి వెళ్ళేది. అయితే ఈనెల 16వ తేది నుండి ఒక్క పూట బడులు నడుస్తున్నాయి. అయితే 17వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లేందుకు డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వేచి చూస్తుంది. ఇదే సమయంలో కిషోర్ కుమార్ కూడా ఆమె వద్దకు వెళ్లి, కారులో వెళ్దాం అని చెప్పి తన భార్య కూడా వస్తుందని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు.

 అయితే మార్గమధ్యంలోనే ఆమెపై దాడి చేసి చంపేస్తానని బెదిరించి సెల్ ఫోన్ లాక్కొని, పాండురంగాపురంలోని ఒక ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన భర్తను పిల్లలను చంపుతానని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఆ బాధితురాలు విషయం ఎవరికీ చెప్ప కుండా మనసులో పెట్టుకొని తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె చివరికి ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. తన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం కాస్త బయటపడటంతో కిషోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: