పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే ఒకరిని చెసుకుంటారు..అది మన దేశ సంప్రదాయం.. ఇక అనుకొని పరిస్థితులు ఎదురైతే ఇంకో పెళ్ళి చేసుకోవడం చూస్తారు..కానీ ఈ మధ్య కాలంలో డబ్బుల కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం సర్వసాధారణం అయింది. ఇప్పుడు ఓ వ్యక్తి నిత్య పెళ్లి కొడుకు అయ్యాడు.. ఒకరిని ఇద్దరిని కాదు ఏకంగా 250 మందిని వివాహం ఆడాడు..వామ్మో ఇదెంది..ఒకేసారి ఇలా ఎలా చేస్తారు అని చాలా మంది ఆలోచనలొ పడ్డారు..అసలు ఒకరికి తెలియకుండా మరొకరిని ఎలా  పెళ్ళి చేసుకున్నారు. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..



నకిలీ ఐడీ, ఫొటోలను ఉపయోగించి పెళ్లి పేరుతో యువతులను మోసం చేస్తున్న ఓ ముఠాను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు..అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని చెప్పుకొని భారతీయ మహిళలను దారుణంగా మోసం చేశారు.ఏకంగా 250 మంది యువతులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.ఘజియాబాద్‌లోని రాకేష్ మార్గ్‌లో నివసిస్తున్న ఓ యువతికి మ్యాట్రోమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది.అయితే అతను అమెరికాలో ఇంజనీర్ అని చెప్పి ఆమెను ప్రేమలో దింపాడు.



భారత్ రాగానే పెళ్లి చేసుకుందామన్నాడు. ఓ రోజు ఫోన్ చేసి రూ.3.5 కోట్ల విలువైన నగలతో పెళ్లి చేసుకునేందుకు ఇండియా వస్తున్నానని ఆ యువతికి చెప్పాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు పట్టుబడ్డానని చెప్పాడు..మరో యువతి తో చెప్పి నమ్మించి 35 లక్షలను వేయించుకున్నాడు.ఆ తర్వాత అతని నుంచి ఫోన్ లేకపోవడంతో మోస పోయాయని తెలుసుకొని సైబర్ క్రైమ్ ను ఆస్రయించారు.కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు నైజీరియాకు చెందిన ఉడెక్వే సిప్రియన్‌గా గుర్తించారు. అతని భార్య నోంగేసై జె కూడా అతనితో కలిసి ఈ మోసాల్లో పాల్గొంటోంది.. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: