
దీంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు చివరికి పోలీసుల చుట్టూ తిరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఒక అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి పోర్న్ వీడియోలు చూసే వారిని టార్గెట్ గా చేసుకోవడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే పోర్న్ వీడియో చూస్తున్న వారికి ఒక నోటిఫికేషన్ పంపించడం నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఖాతా ఖాళీ చేయడం చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల పక్కా సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు.
ఢిల్లీలోనే గురుగ్రామ్ లో 18 మంది బాలురు, నలుగురు బాలికలు గ్రూప్ గా ఏర్పడి కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నా వారినే టార్గెట్గా చేసుకొని ఇక అశ్లీల వీడియోలు చూస్తున్న సమయంలో ఒక నోటిఫికేషన్ పంపించేవారు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు లీకయ్యాయి. భద్రంగా ఉంచాలంటే ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ ఈ నోటిఫికేషన్ ఉండేది. తర్వాత యువతులతో సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లకు కాల్ చేసి అదనపు చార్జీల రూపంలో డబ్బులు దోచుకునే వారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది దగ్గర డబ్బులు దోచుకున్నారు. అయితే ఇటీవల బాధితులు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఇది పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి కాల్ సెంటర్లో పని చేస్తున్న 22 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.