ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని సభ్య సమాజంలో గౌరవంగా బతకడం కంటే దొంగతనాలకు పాల్పడి అందినకాడికి దోచుకుని జల్సాలు చేయడానికి నేటి రోజుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఇక చోరీలకు పాల్పడి చివరికి కటకటాలపాలవుతున్నారు. అదే సమయంలో ఇక దొంగతనం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులను వెతుకుతూ ఉన్నారు దొంగలు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దొంగతనాలు చేయడం ఎలా అని నేర్చుకొని చోరీలకు పాల్పడుతున్న వారు కూడా అక్కడక్కడ తారసపడుతుంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక చోరీ చేసిన తర్వాత పోలీసులకు ఎలాంటి ఆచూకీ దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో చోరీ కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను ఒక కొరియర్ బాయ్.. ఆన్లైన్ ఆర్డర్లను  డెలివరీ చేస్తూ  వచ్చిన డబ్బులతో జీవిస్తూ ఉంటాడు. కానీ అతనిలో మరొక వ్యక్తి దాగి ఉన్నాడు. అతనే దొంగ. కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న సమయం సందర్భం చూసి చివరికి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు.. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొరియర్ బాయ్ మహిళను బెదిరించి చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.



 వుడ్స్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ చుట్టుకొని ఒక ఇంట్లో కొరియర్ అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న యజమానురాలు ఫోన్లో మాట్లాడుకుంటూ తలుపు తీసింది. అప్పటికే అతని చేతిలో కత్తి సిద్ధంగా ఉంది. దీంతో ఆమె కత్తిని గమనించి అరిచే లోపే.. అతడు ఆమె గొంతు పై కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్నీ ఇచ్చేయాలి అంటూ డిమాండ్ చేశాడు. అయితే తన వద్ద ఏమీ లేదని కేవలం మంగళసూత్రం మాత్రమే ఉందని పెద్దగా కేకలు వేసింది. అప్పటికే ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తి ఇదంతా వింటున్నాడు  అది గమనించి ఆ మహిళ నోటికి టేప్ అతికించాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: