
తర్వాత అందరూ హాయిగా నిద్ర పోయారు. కానీ ఉదయం లేచి చూసే సరికి అందరూ షాక్. ఎక్కడ కోడలు ఇంట్లో కనిపించలేదు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించగా అప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంకుష్ అనే వ్యక్తికి మూడు నెలల క్రితం శివపురి తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత శివపురి ఎక్కువకాలం పుట్టింట్లోనే ఉండిపోయింది. తల్లిదండ్రుల బలవంతం మీద అత్తారింటికి వెళ్ళింది. తొలిరోజు భర్తకు పాలు ఇచ్చి అత్తమామలకు ఎంతో ప్రేమగా రోటీలు చేసింది. కానీ ఆ తర్వాత రోజు కానీ అర్థం కాలేదు పాలు, అత్తమామలకు ఇచ్చిన రో rటీలలో నిద్రమాత్రలు కలిపింది అని . వాళ్ళు నిద్రపోయిన తర్వాత శివపురి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులు చివరికి కేసు పెట్టగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన సమయంలో శివపురి ఓ యువకుడితో వెళ్ళిపోయినట్లు కనిపించడం గమనార్హం. అంతేకాదు బీరువాలో 70 వేల రూపాయల నగదు లక్ష రూపాయల విలువ చేసే నగలు కూడా మాయమయ్యాయి అన్నది గ్రహించారు బాధిత కుటుంబ సభ్యులు. ఇక కోడలు చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయ్యారూ అనే చెప్పాలి.