ఒకప్పటి కాలంలో అయితే కేవలం మహిళలు మాత్రమే వేధింపులకు గురయ్యే వారు.  భర్త అత్తింటివారి నుంచి వేధింపులు తట్టుకోలేక న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొంతమంది భర్తలు నుంచి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న ఘటనలు కూడా చాలానే చూశాం. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యా బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే.  భార్యతో వేగలేక విడాకులు తీసుకుంటున్న భర్తలు  ఎంతోమంది ఉన్నారు. అంతే కాదు ఇలా భార్యల నుంచి వేరుపడిన వారికి అండగా నిలిచేందుకు భార్య బాధితుల సంఘం కూడా మొదలు పెడుతూ ఉండడం గమనార్హం.


 ఇలా నేటి రోజుల్లో కలికాలంలో అన్ని కూడా చూడాల్సి వస్తుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న భార్య బాధితుల సంఘం ఒక వ్యక్తికి అండగా నిలిచింది. భార్య నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత విడాకులు తీసుకున్న వ్యక్తికి పెళ్లి తరహాలోనే గ్రాండ్గా పార్టీ ఇచ్చేందుకు సిద్ధమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు ఇలాంటి వారితో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ముంబైలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏకంగా భార్యలు బతికుండగానే వారికి పిండ ప్రదానం చేశారు.


 సాధారణంగా పితృ పక్షం  రోజుల్లో ఎంతో మంది చనిపోయిన పూర్వీకులకు పిండప్రదానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం భార్యా బాధితులు బతికున్న మాజీ భార్య లకు పిండ ప్రదానం చేశారు. ఇలా చేసి భార్యలపై కోపాన్ని ఆవేదనను వినూత్నంగా చాటుకున్నారు. పితృ పక్షం  సందర్భంగా 50 మందికి పైగా భార్య బాధితులు వారికి పిండప్రదానం చేయడం ఇందులో కొంతమంది గుండు కూడా కొట్టించుకోవడం గమనార్హం. వివాహానికి  సంబంధించిన జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా ఆచార సాంప్రదాయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.  ఏదేమైనా ఇలా భార్యలు బతికుండగానే వారికి పిండప్రదానం చేయడం మాత్రం సంచలనంగా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: