ఇటీవల కాలంలో డాక్టర్లే కనిపించే దేవుళ్ళు అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు జనాలు. కరోనా వైరస్ కాలంలో ఎంతోమంది డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారు. దీంతో ఇక వైద్య వృత్తిపై ప్రతి ఒక్కరికి కూడా అమితమైన గౌరవం పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో కొంతమంది డాక్టర్లు మాత్రం ప్రాణాలు పోసే దేవుళ్ళుగా కాదు ఏకంగా మనుషుల ప్రాణాలను తీసే యమకింకరులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. నిర్లక్ష్యంగా వైద్యం అందిస్తూ చివరికి ఎన్నో ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు.


 ఇంకొన్ని ఘటనల్లో ఏకంగా ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చే విధంగా చికిత్స అందిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత ఏకంగా కొంతమందిలో మళ్ళీ వైద్యులు అంటే భయం పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇక కొంతమంది వైద్యులు అయితే ఇంకా లోకాన్ని కూడా సరిగ్గా చూడని పసికందుల పాలిట యమకింకరులుగా మారిపోతున్నారు. సరైన వైద్య చికిత్స అందించడంలో విఫలం అవుతూ చివరికి పసికందుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చికిత్స వికటించి చివరికి మూడు నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కుటుంబ సభ్యులందరినీ కూడా విషాదంలో ముంచేసింది అని చెప్పాలి. భట్టిప్రోలు కు చెందిన మౌనిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడు నెలల కొడుకును ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది. అయితే వైద్యులు ఆ బాలుడికి చికిత్స అందించారు. కానీ వైద్యం వికటించడం కారణంగా చివరికి ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతి చెందిన వార్త విని తల్లి మౌనిక స్పృహ కోల్పోయింది. డాక్టర్లకు బదులు నర్సులు చికిత్స చేయడంతోనే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: