
అంతే కాదండోయ్ ఇక తమను ప్రేమించడం లేదని లేదా పెళ్లి చేసుకోవడం లేదు అనే కారణంతో ఏకంగా అప్పుడు వరకు ప్రాణంగా ప్రేమించాము అంటూ చెప్పిన వారినే దారుణంగా హత మారుస్తున్న ఘటనలు కూడా సభ్య సమాజంలో కోకోళ్లుగా వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు అబ్బాయి ప్రేమోన్మాదిగ మారిపోయి అమ్మాయిపై దాడి చేయడం ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కానీ అప్పుడప్పుడు ఏకంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలపై దాడి చేసి హత్యాయత్నం చేయడం లాంటి ఘటనలు కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని ప్రియుడు అడిగాడు. సాధారణంగా ప్రియుడు ఇలా అడిగితే ఎగిరి గంతేస్తుంది ప్రియురాలు. కానీ ఇక్కడ యువతి మాత్రం ఏకంగా బ్లేడుతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో వెలుగు చూసింది. అశోక్ అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే లక్ష్మీ సౌమ్య అతనితో ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుందామని అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. కానీ ఆమె మాత్రం పెళ్ళికి నిరాకరించింది. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే సౌమ్య తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో అశోక్ పై దాడి చేసింది. ముఖంపై విచక్షణ రహితంగా కోసింది. దీంతో 50 కుట్లు పడ్డాయి. కాగా పోలీసులు సౌమ్యని అరెస్టు చేశారు.