
దీంతో ఇక దృశ్యం సినిమాను రెండుసార్లు చూడడమే కాదు యూట్యూబ్లో కొన్ని వీడియోలను పరిశీలించి చివరికి దారుణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్ లోని బాగ్పాత్ జిల్లా పరిధి ముఖందాపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంకిత్ కోకర్ అనే వ్యక్తి లక్నోలో పిహెచ్డి పూర్తి చేశాడు. అయితే గడిచిన 25 ఏళ్లలో ఇతని తల్లిదండ్రులతో సహా కుటుంబం మొత్తం వివిధ కారణాల వల్ల చనిపోయారు. దీంతో ఎవరు లేని ఒంటరిగా మారిపోయాడు అంకిత్. ఘజియాబాద్ కు చెందిన బంధువైన ఉమేష్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక అంకిత్ కు ఎవరూ లేకపోవడంతో ఉమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో వాడి లాగానే చూసుకునేవారు.
ఇక పోతే ఇటీవల అంకిత్ ఏదో కారణం చేత తన భూమిని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఈ సమయంలోనే ఉమేష్ అతని వద్ద 30 లక్షల అప్పుగా తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం చేశాడు. ఇక డబ్బు ఎవరీ మధ్య అయినా గొడవ పెడుతుంది. ఇక్కడ అదే జరిగింది. అంకిత్ ఉమేష్ మధ్య గొడవ జరిగింది. దీంతో అంకిత్ పై పగ పెంచుకున్న ఉమేష్ అతన్ని చంపేస్తే ఆస్తి మొత్తం సొంతమవుతుందని కుట్రపన్నాడు. అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 సినిమాను రెండుసార్లు చూడటమే కాదు.. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి అంకిత్ ను దారుణంగా చంపేసాడు. అంకిత్ కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఇక అనుమానం వచ్చిన పోలీసు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.