ఇటీవల కాలంలో ఎన్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లలో అటు అక్రమ రవాణాకు చిరునామాగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే అధికారులు అటు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకత వేసేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్న కేటుగాళ్లు మాత్రం రోజురోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా ఇటీవల కాలంలో ఎంతోమంది అక్రమార్కులు తమలో ఉన్న క్రియేటివిటీని బయటపెడుతూ ఇక అక్రమ రవాణాకు పాల్పడుతున్న తీరు చూసి అధికారులు సైతం షాక్ అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే విదేశీబంగారం అక్రమ రవాణాకు చిరునామాగా మారిపోయింది. ఎంతోమంది కేటుగాళ్లు అటు పోలీసులు తనిఖీల్లో పట్టుబడుతున్నప్పటికీ ఇక కొత్త కేటుగాళ్లు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సుధీర్ కుమార్ అనే ప్రయాణికుడి వద్ద దాదాపు 47 లక్షల విలువ చేసే 827 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే కష్టమ్స్ అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా అటు సుధీర్ కుమార్ బంగారం తరలించడానికి ప్రయత్నించిన తీరు అధికారులు ఒక సైతం ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. ఏకంగా బంగారాన్ని కరిగించి పేస్ట్ గా మార్చి టీ షర్టు వెనుక భాగంతో పూసుకొని తరలించే ప్రయత్నం చేశాడు.


 అయితే అతని కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించగా ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు. ఇక అతన్ని విచారించగా.. పొంతన లేని సమాధానం చెప్పడంలో.. చివరికి బంగారం గుట్టు బయటపడింది. అతని అదుపులోకి తీసుకుని అధికారులు అతని టీషర్ట్ లోపల దాచుకున్న 827 గ్రాముల బంగారాన్ని కూడా సీజ్ చేసారు. ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: