
ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ అనే మాయలో పడిపోయి చివరికి కన్నవారిని దారుణంగా హతమార్చేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక ఇటీవల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. ఏకంగా మైనర్ కూతురు తల్లిని దారుణంగా హత్య చేసింది. ప్రేమకు అడ్డుగా ఉంది అన్న కారణంతో ఇక ఈ దారుణానికి ఒడి కట్టింది అని చెప్పాలి. ఆ తర్వాత తల్లి శవం పక్కన ప్రియుడితో కలిసి రాత్రంతా నిద్రించింది. ఆ తర్వాత ఉదయం లేచి ఇంటి నుంచి పారిపోయారు ఇద్దరు.
గ్వాలియర్ లోని హాజీరా ప్రాంతంలో మమత కుష్వాహ అనే 45 ఏళ్ల సింగిల్ పేరెంట్ ఉంటుంది. అయితే ఆమెకు ఒక మైనర్ కూతురు ఉంది. అయితే పొద్దున్నుంచి మమతగాని ఆమె కూతురు కానీ కనిపించలేదు. ఇంటి యజమానికి ఏదో అనుమానం వచ్చి తలుపులు తట్టి చూసాడు. ఉదయం సమయంలో గదిలోకి వెళ్లి చూడగా ఒకసారిగా షాక్ అయ్యాడు. మంచం కింద రక్తం మరకలతో ఉన్న దుప్పటి కనిపించే సరికి ఏదో జరిగిందనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు దుప్పటి కింద ఉన్న మమత మృతదేహంను స్వాధీనం చేసుకున్నారు. ఇక తర్వాత కనిపించకుండా పోయిన కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.