
ఇక ఇప్పుడు మందుబాబుల వీక్నెస్ ని తమకు ఆసరాగా మార్చుకొని ఇక ఇప్పుడు సైబర్ నెరగాళ్లు ఖాతాలు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్నది తెలుస్తుంది ఈ క్రమంలోనే మందుబాబులు అందరిని కూడా అలెర్ట్ చేసే ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు తెర తీశారు. ఏదో ఒక విధంగా ట్రై చేసి ఇక అమాయకపు ప్రజలను టార్గెట్ చేసి ఖాతాలను ఖాలి చేసే సైబర్ నేరగాళ్ళు.. ఇక ఇప్పుడు మందుబాబులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ ధరలకే విదేశీ మద్యం బీర్లు ఆఫర్ల పేరుతో ఇక ఎంతో మంది ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారట.
ఇలా తక్కువ దొరికే విదేశీ మద్యం దొరుకుతుంది అని తెలిస్తే మద్యం ప్రియులు ఎవరైనా సరే కాస్త తొందరపడి పోతారు. ఇలా తొందరపడ్డారు అంటే ఖాతాలు ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే ఇలా మొబైల్ కి మెసేజ్ లో వచ్చిన లింకు క్లిక్ చేసి అడ్వాన్స్ పంపారో లేదో ఇక మీ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం మాయం అవుతాయట. అందుకే మద్యం ప్రియులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి మెసేజ్లు ఏవైనా వచ్చాయి అంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. పోలీసులకు సమాచారం అందించాలి అంటూ తెలిపారు.